హైదరాబాద్ నగరంలోని ఫతేనగర్ ఏరియాలోని హోమ్ వ్యాలీలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి క్రూర మృగంలా ప్రవర్తించాడు. మూగ జీవాల పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించి, ఆ కుక్క పిల్లలను పట్టుకుని నేలకేసి కొట్టి రాక్షసానందం పొందాడు. అతని క్రూర చర్యలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో బయటకు రావడంతో ఆ కిరాతకుడుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో జంతు ప్రేమికులు, నెటిజన్లు సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించడం ఏమిటని ఇలాంటి వారిని కఠింగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.