హైదరాబాద్ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. తప్పతాగి కారుతో రోడ్డెక్కిన ఓ వ్యక్తి అతివేగంగా కారు నడిపి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దంపతులు మృత్యువాతపడ్డారు. హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ జరిగింది. పోలీసుల కథనం మేరకు.. లంగర్ హౌస్‌కు చెందిన మోనా ఠాకూర్ (35) మొదటి భర్తతో విడిపోయింది. ఆ తర్వాత రెండేళ్ల క్రితం బంజారాహిల్‌కు చెందిన దినేశ్ గిరి (38)ను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరూ లంగర్‌హౌస్ గొల్లబస్తీలో నివాసముంటూ ఐటీ ఉద్యోగం చేస్తున్నారు.
కారు బలంగా ఢీకొట్టడంతో ఎగిరిపడిన మోనా అక్కడికక్కడే మృతి చెందగా, దినేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చంచల్‌గూడకు చెందిన మహ్మద్ అబ్బాస్, జీడిమెట్ల సూరారం ప్రాంతానికి చెందిన షేక్ అక్తర్, జూపార్క్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జావీద్ తీవ్రంగా గాయపడ్డారు.