మే 13న ఎన్నికలు - తెలంగాణలో రూ.10కోట్ల నగదు స్వాధీనం..

సెల్వి

గురువారం, 21 మార్చి 2024 (18:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు ఇప్పటివరకు రూ.10 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా, సీసీటీవీల ద్వారా మద్యం రవాణాను పర్యవేక్షించాలని హైదరాబాద్‌లోని పోలీస్ శాఖ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆదేశించింది. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన సమావేశంలో ఈ విషయం వెల్లడైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు సమన్వయంతో పని చేయాలని ఆమె కోరారు. 
 
ఈ సమావేశంలో పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల స్ఫూర్తితో రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ మరింత సమర్ధవంతంగా పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు