ఎన్నికలు.. యూఏఈకి ఐపీఎల్ 2024 షిఫ్ట్.. ఇందులో నిజమెంత?

సెల్వి

శనివారం, 16 మార్చి 2024 (21:37 IST)
IPL 2024
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చే అవకాశాలను బీసీసీఐ చీఫ్ జే షా గట్టిగా తిరస్కరించారు. 
 
ఐపీఎల్‌ను భారత సరిహద్దుల్లోనే పటిష్టంగా నిర్వహిస్తామని, విదేశీ గడ్డపై ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయనే పుకార్లను జై షా కొట్టిపారేశారు. ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను విదేశీ గడ్డపై నిర్వహించే అవకాశం లేదని బీసీసీఐ తేల్చి చెప్పేసింది.  
 
2019లోనూ ఎన్నికల సందర్భంగా ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించడాన్ని బీసీసీఐ ఈ సందర్భంగా హైలైట్ చేసింది. శనివారం భారత ఎన్నికల సంఘం ఏప్రిల్ 19 నుండి జూన్ 4 వరకు ఏడు దశల్లో ఎన్నికల తేదీలను ప్రకటించడంతో సమగ్ర ఐపీఎల్ షెడ్యూల్‌‌ను బీసీసీఐ ఎప్పుడు విడుదల చేస్తుందోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు