బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

ఠాగూర్

సోమవారం, 7 ఏప్రియల్ 2025 (14:46 IST)
బట్టతలపై జుట్టు వచ్చేలా చేస్తానంటూ ఓ వ్యక్తి నమ్మించాడు. దీంతో బట్టతల రాయుళ్లంతా ఆయన వద్దకు క్యూకట్టారు. తన వైద్యంలో భాగంగా, తన సెలూన్ షాకుపు వచ్చిన బట్టతల రాయుళ్లందరికీ తలపై ఏదో రసాయనం పూశారు. సీన్ కట్ చేస్తే ఈ వైద్య కాస్త వికటించడంతో పలు అనారోగ్య సమస్యలతో ఇపుడు లబోదిబోమంటున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్‌కు చెందిన షకీల్ భాయ్ అనే వ్యక్తి బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశాడు. ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు కూడా తన వైద్యంతో జట్టు వచ్చేలా చేసినట్టుగా పత్రికల్లో, సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మిన బట్టతలరాయుళ్లంతా ఆయన వద్దకు క్యూకట్టారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఫతే దర్వాజా వద్ద షకీల్ భాయ్‌కు చెందిన బిగ్ బాస్ సెలూన్‌ వద్దకు క్యూకట్టారు. 
 
తన వద్ద వచ్చిన వారందరికీ గుండు గీసిన షకీల్ భాయ్.. వారి తలపై ఏదో రసాయన ద్రావకాన్ని పూశాడు. అయితే, ఆ కెమికల్స్ వికటించడంతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. జట్టు కోసం పోతే కొత్త సమస్యలు వచ్చాయంటూ అనేక మంది ఇపుడు లబోదిబోమంటూ, వైద్యం కోసం ఆస్పత్రుల్లో చేరారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు