త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని తెలంగాణ రాష్ట్ర పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, ఈ నెల 31వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరిగే సూచనలు ఉన్నాయని చెప్పారు.
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వస్తారని భావిస్తున్నానన్నారు. 80 వేల పుస్తకాలు చదివిన నేతగా సభకు వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. మేడ్చల్, రంగారెడ్డి అక్రమార్కుల చిట్టాను త్వరలో విప్పుతామని హెచ్చరించారు.
మరోమంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చకు రావాలన్నారు. ప్రతి సభ్యుడు సభ విలువను కాపాడాలని, ప్రజాస్వామ్యయుతంగా చర్చకు రావాలన్నారు. శాసనసభ, మండలిలో సమర్థవంతంగా ప్రజల అంశాలు చర్చకు రావాలన్నారు.