తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

సెల్వి

మంగళవారం, 21 మే 2024 (16:49 IST)
తెలంగాణకు ఐఎండీ సమాచారం ప్రకారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. దీంతో వేసవి వేడి నుండి ప్రజలకు ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే మితమైన ఉష్ణోగ్రతలు, తేమతో పాటు దోమల బెడద పెరిగిపోవడంతో కలుషిత ఆహారం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి అప్రమత్తంగా వుండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. 
 
ఈ మేరకు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా.బి. వర్షాల సమయంలో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని రవీందర్ నాయక్ సలహా ఇచ్చారు. వర్షాల సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలని మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యాతో పోరాడటానికి దోమలను నియంత్రించే.. ఇంటి పరిసరాలను శుభ్రంగా వుంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా చాట్, సలాడ్‌లు, పండ్లు, జ్యూస్‌లు వంటి బహిరంగ ప్రదేశాల్లో తాగకుండా వుండటం మంచిదన్నారు. 
 
అలాగే హ్యాండ్ శానిటైజర్‌లను మీతో పాటు వాడండి. 
బయట తినడం మానుకోండి.
ఇంటి ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి. 
తలుపులు మరియు కిటికీలను దోమ తెరలతో కప్పేయండి. 
ఉదయం మరియు సాయంత్రం సమయంలో కిటికీలు మరియు తలుపులు మూసి ఉంచండి
క్రిమిసంహారక మందులు వాడాలి
పిల్లలు కాళ్లతో పాటు చేతులను కప్పి ఉంచే లేత రంగు దుస్తులను ధరించాలి
దోమలు వృద్ధి చెందకుండా సెప్టిక్ ట్యాంకులను మెష్‌తో కప్పండి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు