మహా శివరాత్రి, వారంపదిరోజులు స్నానం చేయనివాళ్లు పూలు అమ్ముతారు: రాజాసింగ్ (video)

ఐవీఆర్

సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (18:38 IST)
గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మహా శివరాత్రి (Maha Shivaratri) పండుగ నిర్వహించుకోవడం గురించి చెబుతూ పూజా సామగ్రిని ఎవరి వద్ద కొనవద్దో చెప్పుకొచ్చారు. మహా శివరాత్రి నాడు బొట్టు పెట్టుకోకుండా వున్న వ్యక్తుల దగ్గర్నుంచి పూజా సామగ్రి కొనొద్దని సూచన చేసారు.

అలాగే పూలు అమ్మేవాళ్లు కొంతమంది వారంపదిరోజుల పాటు స్నానం కూడా చేయరనీ, అలాంటి వాళ్ల దగ్గర్నుంచి పూలు కొనవద్దని చెప్పారు. హిందువులు మహా శివరాత్రి నాడు ఎంతో భక్తిశ్రద్ధలతో స్నానాదికాలు ఆచరించి పూజ చేసేందుకు దేవాలయాలకు వెళ్తారనీ, కానీ వాళ్లు పూజా సామగ్రి కొనేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకుని కొనాలని వెల్లడించారు. 

మహాశివరాత్రి రోజు హిందువుల దగ్గరే పూజా సామాగ్రి కొనాలి : ఎమ్మెల్యే రాజాసింగ్

అమ్మే వారికి బొట్టు ఉందా లేదా అని చూసి కొనండి

పువ్వులు, కొబ్బరికాయలు అమ్మే వాళ్లు కొందరు వారం పది రోజులు స్నానమే చేయరు

పూజా సామాగ్రి కొనే ముందు ఒకసారి ఆలోచించి కొనండి

- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ pic.twitter.com/f6MRlMqXsW

— BIG TV Breaking News (@bigtvtelugu) February 24, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు