భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం (Video)

ఠాగూర్

మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (19:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మంగళవారం మహాకుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానమాచరించారు. తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి ఆయన ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నాలు చేశారు. పవన్ సతీమణి అన్నా లెజినోవా క్రిస్టియన్ అయినప్పటికీ ఆమె కూడా హిందూ సంప్రదాయం ప్రకారం పుణ్య స్నానం చేశారు. ఈ పర్యటనలో ప్రముఖ సినీ దర్శకుడు, తన స్నేహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. 
 
కాగా, పవన్ కళ్యాణ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించే సందర్భంగా తన చొక్కాను పూర్తిగా తీసివేసి కేవలం ధోతిపై నదిలో మూడుసార్లు మునిగి పుణ్యస్నానం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


 

ప్రయాగ రాజ్ త్రివేణి సంగమంలో మహకుంభ మేళా సందర్భంగా కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించిన గౌ|| ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#Mahakumbh #PawanKalyanAtMahakumbh pic.twitter.com/h30LXjufgI

— JanaSena Shatagni (@JSPShatagniTeam) February 18, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు