గర్భిణీని భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో దారుణం జరిగింది. నిండు గర్భిణి అయిన భార్యను కసాయి భర్త గొంతు నులిమి హత్య చేశాడు. పీఎం పాలెం ప్రాంతంలో ఉండే జ్ఞానేశ్వర్, అనూష మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో భార్య మరికొన్ని గంటల్లో ప్రసవించాల్సివుండగా, కసాయి భర్త ఏమాత్రం కనికరం లేకుండా ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై తన భార్యను తానే హత్య చేసినట్టు పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.