Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

సెల్వి

శుక్రవారం, 21 మార్చి 2025 (14:09 IST)
Two Head snakes
పాములు అంటే భయపడనివారు ఎవరూ ఉండరు. కొందరైతే పాము కనపడితే పరుగులు తీస్తారు. అయితే రెండు తలల పాము ఇంట్లో ఉంటే.. కుబేరులు అవుతారని తాంత్రిక పూజలు చేసేవారు నమ్మిస్తూ ఉంటారు. ఇది తప్పుడు ప్రచారం. ఈ పామును రెండ్ శాండ్ బోవా అని అంటుంటారు. ఈ పాము విషపూరితమైనది అస్సలు కాదు.
 
అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్‌ నాచారంలోని దుర్గానగర్ శివాలయం ఆవరణలో రెండు తలల పాము సంచరించింది. దీన్ని చూసిన భక్తులు భయాందోళనలకు గురయ్యారు. 
 
వెంటనే ఆలయ నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులతో పాటు అటవీ శాఖాధికారులు అక్కడికి చేరుకున్నారు. పామును ఆలయం నుంచి తరలించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

శివాలయంలో రెండు తలల పాము

హైదరాబాద్‌ నాచారంలోని దుర్గానగర్ శివాలయం ఆవరణలో రెండు తలల పాము సంచరించింది. దీన్ని చూసిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఆలయ నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులతో పాటు అటవి అధికారులు అక్కడికి చేరుకున్నారు. పామును ఆలయం నుంచి తరలించడంతో… pic.twitter.com/2zv2sI6QkF

— ChotaNews App (@ChotaNewsApp) March 21, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు