శ్రీ చైతన్య స్కూల్ మూడో అంతస్తు నుంచి దూకిన 15 ఏళ్ల విద్యార్థిని

శనివారం, 4 మార్చి 2023 (11:00 IST)
10వ తరగతి చదువుతున్న కొలిపాక సాయి శరణ్య అనే 15 ఏళ్ల విద్యార్థిని శుక్రవారం సాయంత్రం ఖమ్మంలోని శ్రీశ్రీ సర్కిల్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లోని మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 
 
పాఠశాల సిబ్బంది ఆమెను పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినా పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు యాజమాన్యమే కారణమంటూ పీడీఎస్‌యూ కార్యకర్తలు పాఠశాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి నిరసనకు దిగారు. అయితే, పాఠశాల యాజమాన్యం ఆరోపణలను కొట్టిపారేసింది.
 
బాలిక ప్రమాదవశాత్తు భవనంపై నుండి పడిపోయిందని పేర్కొంది. ఆమె పాదరక్షలు మూడో అంతస్తు మెట్లపై కనిపించాయి. శరణ్య సాయంత్రం తన క్లాస్‌మేట్స్‌తో కలిసి మూడవ అంతస్తులోని వాష్‌రూమ్‌కు వెళ్లింది, అయితే ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లో రక్తపు మడుగులో కనిపించింది. 
 
శరణ్య తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించగా, స్కూల్ యాజమాన్యం ఘటనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించి మీడియా ప్రతినిధులను ప్రాంగణంలోకి రానీయకుండా అడ్డుకుంది. 
 
శరణ్యకు రెండు కాళ్లు, చేతులు ఫ్రాక్చర్ అయ్యాయని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు