పటాన్‌చెరుకు చెందిన పురుషోత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. పురుషోత్తం నివాసమున్న ప్రాంతంలోనే రాణి అనే వివాహిత ఉండేది. రాణి భర్త విధుల నిమిత్తం కువైట్‌కు వెళ్ళాడు. దీంతో రాణితో స్నేహం పెంచుకున్న పురుషోత్తం ఆమెకు బాగా దగ్గరయ్యాడు. ఇద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. పురుషోత్తంకు పెళ్ళయిన ఇద్దరు పిల్లలున్నారు. అయితే తన భార్యకు తెలియకుండా పురుషోత్తం రాణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు.
ఆరు నెలల పాటు వీరి వ్యవహారం సాగింది. రాజశేఖర్ తన ఇంటిలో కన్నా రాణి ఇంటిలోనే ఎక్కువసేపు గడిపేవాడు. విషయం కాస్త దుబాయ్‌లో ఉన్న రాణి భర్తకు తెలిసింది. ఫోన్‌లో మందలించాడు. అయినా రాణి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో లింగంపల్లిలోని తన స్నేహితుల సహాయం కోరాడు. పురుషోత్తంను బెదిరించి వదిలేమయన్నాడు. స్నేహితుని కోరిక మేరకు గోవింద్, తులసిలు ఇద్దరూ కలిసి పురుషోత్తంను కిడ్నాప్ చేశారు. రెండు రోజుల పాటు ఒక పాడుపడిన ఇంట్లో ఉంచి హెచ్చరించారు.
అయితే పురుషోత్తం మాత్రం రాణితోనే ఉంటానని తెగేసి చెప్పాడు. దీంతో ఆవేశంతో గోవింద్ పురుషోత్తంను బలమైన దుంగను తీసుకుని తలపై కొట్టాడు. పురుషోత్తం కుప్పకూలిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. వారంరోజుల పాటు పురుషోత్తం ఆచూకీ దొరకలేదు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.