నేను నాలుగేళ్ల క్రితం ఓ అమ్మాయిని ఎంతో ఇష్టపడ్డాను. ఐతే మా పరిచయం నెల రోజుల తర్వాత ఆమె నాకు ఓ విషయం చెప్పింది. అదేమిటంటే... తను ఓ అబ్బాయి చేతిలో మోసపోయిందట. అతడు ప్రేమించానని చెప్పి ఓ రోజు ఆమెను లైంగికంగా అనుభవించి వదిలేశాడట. ఆ తర్వాత అతడు తనతో కాంటాక్ట్ తెంచేసుకుని, ఫోనుకు దొరక్కుండా సిమ్ కార్డ్ సైతం పడేశాడని చెప్పింది. ఆమె నాకు తొలిసారి పరిచయమైన వెంటనే ఈ విషయం చెప్పడంతో ఆమెపై ప్రేమ మరింత పెరిగింది.
నా ప్రేయసి ఇలా ఒకడి చేతిలో మోసపోయిందని తెలిసినా మా పెద్దలు ఆమెతో పెళ్లికి అంగీకరించేశారు. ఇప్పుడు మాత్రం నాకెందుకో ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఏదోగా అనిపిస్తోంది. అతడు మళ్లీ వచ్చేశాడు. ఆమెను పెళ్లాడిన తర్వాత అతడేమైనా బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ నా భార్యను తిరిగి అతడు అనుభవిస్తాడేమోనని భయంగా ఉంది. పెళ్లి చేసుకుంటే ఇలాంటిదేమీ జరుగదు కదా...?
మీరు పెళ్లాడబోయే అమ్మాయి గతంలో జరిగినదంతా చెప్పేసింది. అతడు చేసిన మోసం ఏమిటో కూడా చెప్పేసింది. మీ పెద్దలు కూడా పెళ్లికి ఒప్పేసుకున్నారు. అందరికీ విషయం తెలుసు. ఈ పరిస్థితిలో అతడు మీకు కాబోయే భార్యను బ్లాక్‌మెయిలింగ్ చేసే పరిస్థితి ఎక్కడుంటుంది. అదేమీ జరుగదు. కనుక మీరు నిశ్చితంగా ఆమెను పెళ్లి చేసుకోండి. మీ జీవితం ఆనందమయంగా సాగిపోతుంది. మీ గర్ల్ ఫ్రెండ్ మాజీ ప్రియుడు తేడా చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి. అతడి వ్యవహారం వాళ్లు చూసుకుంటారు.