కుకునూరుపల్లిలో మీ శిరీష ఏం చేసిందో చూడండి...

గురువారం, 6 జులై 2017 (15:18 IST)
బ్యూటీషియన్ శిరీష కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకెళుతోంది. శిరీష కుటుంబ సభ్యులు శిరీషను హత్య చేశారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను చంపేసి ఆ తర్వాత శవంతో నాటకాలు ఆడారంటూ శిరీష కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. తమకు న్యాయం జరిగేట్లు చూడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. 
 
శిరీషను కుకునూరు పల్లిలో కాకుండా వేరే చోటకు తీసుకెళ్లి అక్కడ మర్డర్ చేసి వుంటారని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించారు. శిరీష కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని కుకునూరు పల్లి పోలీసు స్టేషనుకు వెళ్లి అక్కడ శిరీష ఏం చేసింది..? అనే విషయాలను వారికి వివరించినట్లు తెలుస్తోంది. 
 
మరి పోలీసులు ఇచ్చిన క్లారిటీతో శిరీష కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గుతారా లేదంటే కేసును దర్యాప్తు చేయాల్సిందేనంటూ, శిరీషది హత్యేనంటూ పట్టుబడతారా చూడాలి.

వెబ్దునియా పై చదవండి