బీఆర్‌ఎస్‌ గెలుపుకే బీజేపీ యత్నం.. అందుకే మోదీ నోరెత్తలేదు..?

బుధవారం, 8 నవంబరు 2023 (22:25 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ప్రధాని మోదీ మౌనం వీడట్లేదన్నారు. 
 
బీజేపీ, బీఆర్ఎస్, ఏఐఎంఐఎం పార్టీలు ఒక్కటేనని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ ఏమీ మాట్లాడలేదు. దీన్నిబట్టి ఇక్కడ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి ఎన్నికల్లో పోరాడుతున్నట్లు స్పష్టమవుతోంది. 
 
బీఆర్‌ఎస్ ప్రతి నిర్ణయం వెనుక బీజేపీ హస్తం ఉంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీఆర్‌ఎస్‌కు సహకరించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. తద్వారా 2024లో బీఆర్ఎస్ బీజేపీ నుంచి సహాయం పొందుతుందని తెలిపారు.
 
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. 
 
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల డీఎన్‌ఏ ఒకటేనని, వంశపారంపర్య పాలన, అవినీతి, బుజ్జగింపులు రెండు పార్టీల్లోనూ సర్వసాధారణమని విమర్శించారు. తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మరో 4 రాష్ట్రాలతో పాటు ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు