ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత వద్ద ముగిసిన సీబీఐ విచారణ

ఆదివారం, 11 డిశెంబరు 2022 (20:40 IST)
ఢిల్లీ మద్యం స్కామ్‌లో విచారణ ఎదుర్కొంటున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కె.కవిత వద్ద సీబీఐ అధికారులు సాగించిన తొలి రోజు విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటలకు పైగా ఈ విచారణ జరిగింది. హైదరాబాద్ నగరంలోని కవిత నివాసంలోనే ఈ విచారణ జరిగింది. 
 
ఇది ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై, దాదాపు ఏడున్నర గంటల పాటు సాగింది. మొత్తం ఐదుగురు సీబీఐ అధికారుల బృందం కవిత నుంచి పలు ప్రశ్నలకు సమాచారం సేకరించింది. అలాగే, లిక్కర్ స్కామ్‍లో సాక్షిగా కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసింది. 
 
లిక్కర్ స్కాం నిందితుడు అమిత్ ఆరోరా వాంగ్మూలం ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కాగా, 170 సెల్ ఫోన్లు ధ్వంసం చేశారన్న ఆరోపణలపైనా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కవిత గతంలో వాడిన మొబైల్ ఫోన్ల వివరాలపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు