మహిళలపై అఘాయిత్యాలు: డీజీపీకి లేఖ రాసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సోమవారం, 2 డిశెంబరు 2019 (18:51 IST)
రాష్ట్రంలోని విద్యార్థినులకు ఆత్మరక్షణ మెలకువలను నేర్పించేందుకు షీ టీమ్స్ ద్వారా ఏర్పాట్లు చేయాలనీ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి డీజీపీకి లేఖ రాశారు. విద్యార్థినులపై అఘాయిత్యాలు, దాడులు జరుగకుండా సరైన అవగాహనా కల్పించాలని డీజీపీకి సూచించారు.

పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని విద్యాశాఖా అధికారులను ఆదేశించారు. సమస్య వచ్చినపుడు ఎలా ఎదుర్కోవాలి, ఎవరిని ఆశ్రయించాలి అనే విషయంపై విద్యార్థినులను చైతన్యపరచాలని మంత్రి కోరారు. షీ-టీమ్స్‌పై  అవగాహన పెంపొందించాలని సూచించారు. 
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. వేధింపులకు గురవుతున్న మహిళలు, కళాశాల విద్యార్థినులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలనీ కోరారు. వాట్సాప్, కంట్రోల్ రూమ్, షీ-టీమ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో వస్తున్న ఫిర్యాదులపై పోలీసులు స్పందించి బాధితులకు అండగా నిలవాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు