తెలంగాణకు భారీ వర్ష సూచన, అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం

శనివారం, 10 అక్టోబరు 2020 (18:22 IST)
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు పడుతాయని వివరించింది.
 
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. రేపు ఎల్లుండి పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
 
గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలిక పాటి జల్లులు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఈ నెల 14న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది క్రమంగా తుఫానుగా రూపాంతరం చెంది ఒడిశా తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు