జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించేకునేన్ని స్థానాలు ఏ పార్టీ సాధించలేక పోయింది. ఎన్నికల్లో ఆశించినంత ఫలితాలను టీఆర్ఎస్ సాధించలేదు. 100 సీట్లు వస్తాయని భావించినా.. 55కే పరిమితమయింది. బీజేపీకి 48, ఎంఐఎంకి 44, కాంగ్రెస్‌కు 2 సీట్లు వచ్చాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు.