వేసవి కాలంలో ఏర్పడే ప్రయాణికుల రద్దీని నివారించేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులోభాగంగా, హైదరాబాద్ - కటక్ - హైదరాబాద్ ప్రాంతాల మధ్య ఈ రైళ్లను నడిపేలా చర్యలు చేపట్టింది.
జూన్ 6, 13, 20, 27 తేదీల్లో హైదరాబాద్ నుంచి రాత్రి 8.10 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు దువ్వాడకు చేరుకుంది. అక్కడన ుంచి 9.07 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు కటక్‌కు చేరుతుంది.
అలాగే, తిరుగు ప్రయాణంలో కటక్ నుంచి జూన్ 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 10.30 గంట బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.35 గంటలకు దువ్వాడ చేరుతుంది. రెండు నిమిషాల్లో మళ్లీ బయలుదేరి రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఇది నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం, బరంపురం, ఖుర్దా రోడ్, భువనేశ్వర్లలో ఆగుతుంది.