మాస్క్ ధరించకుంటే రూ.1000 అపరాధం.. ఎక్కడ?

గురువారం, 21 అక్టోబరు 2021 (17:42 IST)
మాస్క్ ధరించకుండా ద్విచక్రవాహనం డ్రైవ్ చేస్తే రూ.1000 అపరాధం విధించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్లే రైడ‌ర్‌తో పాటు వెనుకాల కూర్చొనే వారు కూడా తప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాల‌ని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. ఆ ఇద్ద‌రూ హెల్మెట్ ధ‌రించ‌ని యెడ‌ల చ‌లాన్ జారీ చేస్తామ‌న్నారు.
 
అయితే రైడ‌ర్‌తో పాటు వెనుకాల కూర్చున్న వ్య‌క్తి కూడా ప‌లు ప్ర‌మాదాల్లో చ‌నిపోయిన ఘ‌ట‌న‌లు చూశాం. ఈ నేప‌థ్యంలో హెల్మెట్ ధ‌రించాల‌నే నిబంధ‌న‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పోలీసులు తెలిపారు. 
 
మోటార్ వెహిక‌ల్ యాక్ట్ 1989 ప్ర‌కారం.. హెల్మెట్ ధ‌రించ‌కుండా వాహ‌నం న‌డిపితే రూ.100 జ‌రిమానా విధిస్తున్నారు. ఇప్పుడు వెనుకాల కూర్చొనే వ్య‌క్తి హెల్మెట్ ధ‌రించ‌క‌పోయిన రూ.100 జ‌రిమానా విధిస్తూ చ‌లాన్లు జారీ చేస్తామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.
 
ఇక చాలా మంది వాహ‌న‌దారులు కొవిడ్ సేఫ్టీ నిబంధ‌న‌లు పాటించ‌డం లేద‌ని పోలీసులు పేర్కొన్నారు. మాస్కులు ధ‌రించ‌కుండా ప్ర‌యాణిస్తున్నారు. త‌ప్ప‌నిసరిగా హెల్మెట్ ధ‌రించాల‌నే నిబంధ‌న‌తో పాటు మాస్కు కూడా ధ‌రించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. 
 
సీసీ కెమెరాలు, ఆర్టిఫిషీయ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాస్కు ధ‌రించ‌ని వారిని గుర్తించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. మాస్కు ధ‌రించ‌కుండా బైక్‌ల‌పై ప్ర‌యాణించే వారికి రూ.1000 జ‌రిమానా విధిస్తామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు