అప్పు చేసి బైకు తీశాడు.. చలాన్లు కట్టలేక ఆత్మహత్య

బుధవారం, 8 మార్చి 2023 (14:09 IST)
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు కట్టలేక ఎల్లయ్య అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులో పెండింగ్ చలాన్లు కట్టకపోవడంతో పోలీసులు బైకును స్వాధీనం చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లాకు చెందిన ఎల్లయ్య(52) బ్రతుకుదెరువు కోసం కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ వచ్చాడు. హమాలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సైదాబాద్‌లోని ఐఎస్ సదన్ డివిజన్ నీలం రాజశేఖర్ రెడ్డి నగర్ కాలనీలో భార్యపిల్లలతో కలిసి నివాసం వుంటున్నాడు. 
 
అప్పు తీసుకుని బైక్ కొనుగోలు చేశాడు. అయితే బైకుపై అనేక చలాన్లు పడ్డాయి. అయినా మల్లయ్య వాటిని చెల్లించకుండా బైక్ నడుపుతూనే ఉన్నాడు. ఇటీవల ఎల్లయ్య బైక్‌పై వెళుతుండగా పోలీసులు ఆపారు. మీర్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను సీజ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు