ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని కోరారు. సోషల్ మీడియాలో పోస్టులను పెట్టిన నేతల ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో విఫలమైన ప్రభుత్వం గవర్నర్ ని టార్గెట్ చేయడం అప్రజాస్వామికం, శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగ పదవిలో ఉండి ఒక వైద్యరాలిగా ప్రభుత్వానికి, సి ఎస్ కు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు పీరియాడికల్ గా విలువైన సూచనలు చేస్తే గవర్నర్ ని టార్గెట్ చేయడం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమే అన్నారు. అధికార మదంతో కొందరు టిఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్ లను ముఖ్యమంత్రి చేష్టలుడిగినట్లు చూస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో కేసీఆర్ ఒంటెద్దు పోకడలు అందరూ గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ నేతల భూకబ్జాల కారణంగానే వరంగల్ నగరం వరదలకు అతలాకుతలమైనదని విమర్శించారు. రాష్ట్రంలో ఎమ్మార్వో లపై ఏసీబీ దాడులు కేసీఆర్ అవినీతి పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్ లను బిగించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.