మునుగోడు.. ఫోక్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన కేఏ పాల్

మంగళవారం, 25 అక్టోబరు 2022 (23:15 IST)
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ హోటల్‌‌ నిల్చుని వంట చేస్తూ.. జనాలను ఆకట్టుకునేలా ప్రచారం చేశారు. తాజాగా ఓ ఫోక్ సాంగ్‌‌కు అదిరిపోయే స్టెప్పులేశారు. 
 
చుట్టూ జనం గుమికూడగా, తనకు మాత్రమే సాధ్యమైన హావభావాలతో అందరికీ వినోదం పంచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది. 
 
దీపావళి సందర్భంగానూ మునుగోడు నియోజకవర్గంలో కేఏ పాల్ సందడి చేశారు. లోకల్‌గా ఓ సెలూన్‌లో హెయిర్ కట్ చేయించుకున్నారు. ఓటర్లకు మిఠాయిలు, మంచినీళ్ల బాటిళ్లు పంచారు. ప్రస్తుతం డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో డ్యాన్స్‌ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. #KAPaul #ViralVideo #TelanganaNews #MunugodeBypoll #Eenadu pic.twitter.com/pWY2DzmhWK

— Eenadu (@eenadulivenews) October 25, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు