తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. తనను తిట్టడంతో తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ప్రత్యర్థి చెవి, మర్మాంగాన్ని కోసేశాడు. ఆపై పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
అదే ప్రాంతంలో నివసిస్తున్న కూలీ హుస్సేన్ పాషా మంగళవారం మద్యం మత్తులో కార్తీక్‌ను దూషించాడు. ఇది ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. ఘర్షణ మరింత పెరగడంతో కోపంతో ఊగిపోయిన కార్తీక్.. పాషా చెవి, మర్మాంగాన్ని కత్తితో కోసేశాడు.