తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా సెకండ్ వేవ్.. 4వేల కేసులకు పైగా నమోదు

ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (13:19 IST)
తెలంగాణలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. రోజువారీ కేసులు 4 వేలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 5093 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,51,424కి చేరింది. 
 
ఇందులో 3,12,563 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,037 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక తెలంగాణలో కొత్తగా 15 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1824కి చేరింది.
 
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు కరోనా సోకింది. గత కొంత కాలంగా కరోనా తో బాధపడుతున్న మోత్కుపల్లికి శనివారం అర్ధరాత్రి శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఏర్పడ్డాయి. 
 
కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉండటం తో వైద్యులు ఐసీయూలో ఉంచి మరీ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమ్యంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు