తెలంగాణలో న్యూయర్ పురస్కరించుకుని ట్రాఫిక్ ఆంక్షలు

శుక్రవారం, 31 డిశెంబరు 2021 (13:35 IST)
తెలంగాణలో కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్టు ఇప్పటికే సీపీ సీవీ ఆనంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రకటన విడుదల చేశారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ సీవీ ఆనంద్. 
 
డ్రంక్ అండ్‌ డ్రైవ్ తనిఖీలతో పాటు.. అతి వేగంగా ప్రయాణించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ట్రిపుల్ రైడర్స్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు హైదరాబాద్ సీపీ.
 
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. నెక్లెస్ రోడ్ చుట్టూ ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పై వాహన రాకపోకలు నిషేధించినట్టు పేర్కొన్నారు.  
 
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు