తెలంగాణాలో డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు కుదరదు

గురువారం, 9 జులై 2020 (18:13 IST)
రాష్ట్రంలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్ మోగుతుండటంతో పదోతరగతికి జరగాల్సిన పరీక్షలు రద్దయిన విషయం తెలిసందే. అయితే అదే తరహాలో డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా రద్దు చేయాలని పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
 
కాగా ఈ పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ విచారణలో పిటిషన్ తరపున స్పందనతో వాదించిన న్యాయవాది పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్ మార్కుల ద్వారా గ్రేడింగ్ ఇవ్వాలని వినిపించారు.
 
అనంతరం ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు కుదరదని, యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు