ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, రైతులు పండించే పంటలకు మద్దతు ధర పెంచితే 'మీ అయ్య సొమ్ము ఏమైనా పోతుందా?' అంటూ ప్రధాని నరేంద్ర మోడీని సూటిగా ప్రశ్నించారు. దేశంలో రైతులు సహనం కోల్పోతున్నారని, వారి ఓపికను పరీక్షించడం జాతీయ పార్టీలకు మంచిది కాదని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా భగవంతుడు 70 వేల టీఎంసీల నీటిని వరంగా ఇస్తే.. చేతకాని జాతీయ పార్టీలు, నేతలు కేవలం 24 వేల టీఎంసీలను వాడుకునేలా ప్రాజెక్టులు నిర్మించడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే ఆ రెండు జాతీయ పార్టీలూ తన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని కేసీఆర్ సభాముఖంగా డిమాండ్ చేశారు.