మహ్మాద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలు.. ఛార్మినార్‌ వద్ద ఉద్రిక్తత

శుక్రవారం, 10 జూన్ 2022 (23:05 IST)
మహ్మాద్‌ ప్రవక్తపై నుపూర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ చేసిన వ్యాఖ‍్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది.
 
శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లింలు ఆందోళనకు దిగారు. మహ్మద్‌ ప్రవక్తపై మాజీ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు నినాదాలు చేస్తూ మక్కా మసీద్‌ నుంచి చార్మినార్‌ వరకు ర్యాలీ తీశాయి. 
 
ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చార్మినార్‌ వద్ద పోలీసు బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి. ఇదిలా ఉంటే.. తనను హత్య చేస్తామంటూ బెదిరింపు కాల్స్, లేఖలు వస్తున్నాయంటూ నుపుర్ శర్మ.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
సదరు వ్యాఖ్యలకు గాను కొందరు తనను వేధిస్తున్నారని, అసభ్యకరంగా దూషిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నుపుర్‌, ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు