ఆర్ఆర్ఆర్ సక్సెస్.. ఛార్మినార్ వద్ద జక్కన్న సందడి
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (12:47 IST)
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత జక్కన్న రాజమౌళి ఛార్మినార్‌లో సందడి చేశారు. కుమారుడు కార్తికేయతో కలిసి ఛార్మినార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
అలాగే ఛార్మినార్ వద్ద నైట్ బజార్‌ను తిలకించి... ఓ హోటల్‌లో బిర్యానీ తినారు. ఆపై బయల్దేరిన రాజమౌళితో అభిమానులు సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం జక్కన్న ఛార్మినార్ సందర్శన నెట్టింట వైరల్ అయ్యింది.
ఇకపోతే.. ఆర్‌ఆర్‌ఆర్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి మహేశ్ బాబుతో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.