వరంగల్‌ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు యువకులు మృతి

శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (13:30 IST)
వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన పలువురిని కలిచివేసింది. వరంగల్‌ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి సమీపంలో గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన జరిగింది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగదేవిపల్లి గ్రామానికి చెందిన ఇట్ల జగదీశ్‌(19), న్యాల నవీన్‌(20), జనగామ జిల్లా నర్మెట్ట మండలం మాన్‌సింగ్‌ తండాకు చెందిన లకావత్‌ గణేష్‌(21) ముగ్గురు ద్విచక్ర వాహనంపై వరంగల్‌ నుంచి గంగదేవిపల్లికి వెళుతున్నారు. 
 
ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం గంగదేవిపల్లి సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న ముగ్గురు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనస్థలానికి  చేరుకుని వివరాలు సేకరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు