కారు పంక్చర్, దుబ్బాకలో భాజపాదే విజయం, 1470 ఓట్ల ఆధిక్యంతో రఘునందన్ విజయం

మంగళవారం, 10 నవంబరు 2020 (15:59 IST)
తీవ్ర ఉత్కంఠతను రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో ఎట్టకేలకు భాజపా అభ్యర్థి రఘునందన్ రావు 1470 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చివరివరకూ తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరి రౌండ్లలో భాజపా అభ్యర్థి పుంజుకుని విజయం సాధించారు. దీనితో తెరాసకి వచ్చే ఎన్నికలకు భాజపా సవాల్ విసిరినట్లయ్యింది.
 
ఒక రకంగా తెరాస విజయాన్ని కాంగ్రెస్ పార్టీ గల్లంతు చేసింది. 22వ రౌండులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏకంగా 971 ఓట్లు ఆధిక్యం రావడంతో తెరాస ఓట్లకు గండిపడినట్లయింది. ఇక చివరి 23వ రౌండులో భాజపా అభ్యర్థి 412 ఓట్లు ఆధిక్యం రావడంతో ఆయన 1470 ఓట్ల మెజారిటీతో తెరాస అభ్యర్థిపై విజయం సాధించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు