చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం : తెలంగాణ మంత్రి హరీశ్ రావు

ఆదివారం, 1 అక్టోబరు 2023 (11:29 IST)
అక్రమ కేసు బనాయించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం దురదృష్టకరమని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. పాపం.. ఈ వయసులో ఆయనను అరెస్టు  చేయడం ఏమాత్రం మంచిదికాదన్నారు.
 
నిన్నామొన్నటి వరకు స్పందించని తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు.. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పైగా, చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని  సెటిలర్లు కూడా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంలో ఉధృతంగా నిరసనలు జరిగాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ చంద్రబాబు అరెస్టు అంశం తమ రాష్ట్రంలో కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ నేతలు గ్రహించారు. 
 
దీంతో  చంద్రబాబు అరెస్టును బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ఖండిస్తున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్పందించగా, ఇపుడు హరీశ్ రావు స్పందించారు. దీనిపై హరీశ్ రావు మాట్లాడుతూ, గతంలో ఆయన తెలంగాణ అభివృద్ధిని, కేసీఆర్ పాలనను మెచ్చుకున్నారరని గుర్తు చేశారు. 
 
ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు తెలంగాణలో ఎకరా అమ్మితే ఆంధ్రాలో వంద ఎకరాలు కొనేపరిస్థితి వచ్చిందనే విషయాన్ని చంద్రబాబు పలుమార్లు ప్రస్తావించారని చెప్పారు. 
 
తెలంగాణ వస్తే ఏమొస్తుందని అన్నవాళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టు, కళకళలాడే చెరువులు, చెక్ డ్యాములు, కోనసీమను తలపించే ఆయిల్ బామ్ తోటలే సమాధానం చెబుతున్నాయని స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీజేపీలతో ఈ దేశానికి చాలా నష్టం జరిగిందని ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు