ప్రేమించిన యువతి బయటకు రాలేదనీ...

మంగళవారం, 22 జూన్ 2021 (09:39 IST)
సోషల్ మీడియా వేదికగా పరిచయమైన యువతి.. తాను పిలిస్తే ఇంట్లో నుంచి బయటకు రాలేదన్న కోపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ జగద్గిరిగుట్ట నెహ్రూనగర్‌కు చెందిన శుభమ్‌ (26) అనే యువకుడికి బాలానగర్‌ శోభన కాలనీకి చెందిన యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో  సోమవారం శుభమ్‌ యువతి ఇంటికి వెళ్లి ఇంటి నుంచి బయటకు రావాలని ఆమెను కోరాడు.
 
అందుకు ఆమె నిరాకరించింది. దీంతో నానాయాగీ చేసి యువతి, ఆమె తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా యువతి తల్లిదండ్రులే శుభమ్‌ను కొట్టి చంపారని మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్‌ పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు