భార్యను పట్టించుకోని వ్యక్తి "జెంటిల్‌మేన్" ఎలా అయ్యాడు?

WD
పోసాని కృష్ణమురళి, ఆర్తీ అగర్వాల్, లూయిస్ హీరోహీరోయిన్లుగా, నల్లం పద్మజ నిర్మిస్తోన్న "జెంటిల్‌మేన్" చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ఓ భవింతిలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పోసాని మాట్లాడుతూ.. పెళ్లికి ముందునుంచే భార్య కొంగుపట్టుకుని తిరిగే ప్రతి వ్యక్తి ఐదేళ్ల తర్వాత దూరమవుతున్నాడు. అలా అని ఆమెపై ప్రేమలేకకాదు. మరో కొత్త మనిషి పరిచయమయ్యేసరికి గతంలో భార్యపై ఎలాంటి ప్రేమను వ్యక్తం చేసేవాడో.. ఇప్పుడు ఆ అమ్మాయిపై చేస్తుంటాడు. అసలు భార్యను పట్టించుకోడు. దీనికి కారణమేమిటి? అనేది జెంటిల్‌మేన్‌లో చర్చించామని పోసాని చెప్పారు.

రెండు రోజులు షూటింగ్‌తో సినిమా పూర్తవుతుందని, సెప్టెంబరులో పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలుంటాయని కృష్ణమురళి తెలియజేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

సమర్పకుడు నల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ.. మనిషి కొత్తదనాన్ని కోరుకుంటాడు. ఆ కొత్తదనాన్ని జీవితంలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందనాన్ని అంతర్లీనంగా సందేశంతో నిర్మిస్తున్నామని వెల్లడించారు.

పోసాని చిత్రాలంటే ఏదే సందేశంతో ఉంటాయని, అటువంటి ప్రయోగంతో ఈ చిత్రం తెరకెక్కనుందని చలపతిరావు అన్నారు. ఇందులో తాను మంచి పాత్ర పోషిస్తున్నానని ఆయన చెప్పారు.

ఇందులో తాను సైంటిస్ట్‌గా నటిస్తున్నానని, తనపై శుక్రవారం కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని, ఇందులో గెస్ట్‌ పాత్రను పోషిస్తున్నానని ఆయన తెలిపారు.

ఇంకా ఈ చిత్రానికి కెమెరా: వీణా సి. ఆనంద్, సంగీతం: మల్లిక్ శర్మ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పోసాని కృష్ణమురళి.

వెబ్దునియా పై చదవండి