మళ్లీ.. అహనా పెళ్లంట!

WD
రాజేంద్రప్రసాద్‌ హీరోగా గతంలో వచ్చిన 'అహనా పెళ్లంట' చిత్రం అప్పట్లో ప్రేక్షకులను హాస్యపు జల్లులో ముంచెత్తిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడా చిత్రాన్ని నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

విశేషమేమంటే.. ఈ కొత్త వర్షన్‌లో హీరోగా అల్లరి నరేష్‌ పేరు విన్పిస్తోంది. ప్రముఖ దర్శకుడు తెరకెక్కించనున్న "అహనా పెళ్లంట" చిత్రం త్వరలో సెట్‌పైకి రానుంది. మరో ప్రత్యేకత ఏమంటే... అందులో నటించిన రాజేంద్రప్రసాద్‌ ఈ కొత్త చిత్రంలో కీలకపాత్ర పోషించనున్నాడట. మొత్తానికి రాజేంద్రప్రసాద్‌ చిత్రాలన్నీ నరేష్‌కు క్రేజ్‌ తెచ్చిపెడుతున్నాయన్నమాట.

వెబ్దునియా పై చదవండి