ఇన్నాళ్లపాటు వివాహమే వద్దంటూ నాట్యకళకు తనను అంకితం చేసుకున్న సినీ నటి శోభన.. 47 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేరళ జిల్లా తిరువనంతపురంకు చెందిన శోభన.. దక్షిణాది హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించింది. తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది.
2001లో శోభన ఆనంద నారాయణీ అనే అమ్మాయిని దత్తపుత్రికగా స్వీకరించింది. ప్రస్తుతం శోభనకు 47ఏళ్లు. ఇలాంటి తరుణంలో స్నేహితుడు, ఫ్యామిలీ ఫ్రెండ్‌ను శోభన మనువాడనుందనే వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నాట్య కళాకారిణిగా ఇన్నాళ్లు ఆ కళకు అంకితమైన శోభన 2006లో పద్మశ్రీ అవార్డును గెలుచుకున్నారు.