తాజాగా రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లో ఉన్న రాజమౌళి ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసి, మరొక షెడ్యూల్ తీయడానికి సిద్ధమవుతున్నారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే రాజమౌళి సినిమాలో టాప్ హీరోయిన్ కోసం వేట సాగిస్తున్నట్లు సమాచారం. దీని కోసం బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన అలియా భట్ కోసం సంప్రదింపులు చేస్తున్నట్లు వినికిడి.
అలియా భట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కరణ్ జోహార్ ద్వారానే ఈ చర్చలు సాగిస్తున్నట్లు ఇండస్ట్రీ సమాచారం. అలియా భట్‌కు కరణ్ జోహార్ మంచి మిత్రుడు మరియు సలహాదారుగా ఉన్నందున ఆయన చెప్తే ఆమె ఓకె చెప్తుందని ఆయన ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి అలియా కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే డేట్ల సర్దుబాటు వీలవుతుందా లేదా అనే విషయాలను చర్చిస్తున్నట్లు సమాచారం.