అక్కినేని అఖిల్ హీరోగా ఫస్ట్ మూవీ రాకముందే సూపర్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తీరా అఖిల్ ఫస్ట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే... ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తాడనుకుంటే... ఇలా జరిగింది ఏంటని..! రెండో సినిమా హలో కూడా అదే పరిస్థితి. ఆశించిన విజయం సాధించలేదు. ఇటీవల రిలీజైన మిస్టర్ మజ్ను సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో నాలుగవ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు.
అఖిల్ నాలుగవ సినిమాని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. అయితే... ఈ సినిమా బడ్జెట్ ఎక్కువు అవుతుంది. అఖిల్ పైన అంత బడ్జెట్ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి అల్లు అరవింద్ బడ్జెట్ విషయంలో బాగా బేరాలు ఆడుతున్నారట.