అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రియ హీరోయిన్ కాగా, బాలీవుడ్ నటి హేమమాలిని ఓ కీలక పాత్రను ధరించింది.
అయితే, ఈ చారిత్రాత్మక చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్టుగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిపోయినట్టు సమాచారం. అయితే, శాతకర్ణి ఆంధ్రా హక్కులు రూ.21కోట్లకి అమ్ముడుపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆంధ్రా ప్రజలకి సెంటిమెంట్‌గా కనెక్ట్ అయ్యింది. తెలుగు జాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రప్రంచానికి చాటి చెప్పిన గొప్పచక్రవర్తి 'గౌతమిపుత్ర శాతకర్ణి' జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అమరావతిని రాజధానిగా చేసుకొని తన సామ్రాజ్యాన్ని విస్తరించారు శాతకర్ణి.
ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ నేపథ్యంలో రానున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' కోసం ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ఏపీ రాజకీయాల్లో బాలయ్య కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ కూడా శాతకర్ణి ఆంధ్రా హక్కులు అదిరిపోయే రేటు పలికేందుకు దోహదపడినట్టు తెలుస్తోంది.