నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10న. ఈ సంవత్సరం బాలయ్య 60వ జన్మదినోత్సవం కావడంతో పుట్టినరోజును స్పెషల్‌గా ప్లాన్ చేసారు. అయితే కరోనా కారణంగా పెద్దగా పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఉండవు అని ప్రచారం జరిగింది కానీ.. తాజా సమాచారం ప్రకారం... బాలయ్య బర్త్ డేను బాగానే ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
మరో సర్ ఫ్రైజ్ ఏంటంటే... బాలయ్య గతంలో నర్తనశాల సినిమాను ప్లాన్ చేసారు. హీరోయిన్ సౌందర్య మరణంతో ఆ సినిమాను ఆపేసారు. ఇప్పుడు ఆ ఫుటేజ్ లోంచి కొంత తీసి చిన్న వీడియో రిలీజ్ చేయనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బాలయ్య బాబు 60వ పుట్టినరోజును గట్టిగానే ప్లాన్ చేసారు. ఇక బాలయ్య బాబు అభిమానులకు పండగే..!