సీఎం జగన్‌ని కలవడానికి రావాలా? నేను రానన్న బాలయ్య, కన్‌ఫర్మ్ చేసిన సి.కళ్యాణ్..!

శనివారం, 6 జూన్ 2020 (13:28 IST)
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సినీ ప్రముఖులు కలిసి షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి పర్మిషన్స్ అడిగిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్‌ను కూడా కలవనున్నారు. జూన్ 9న సినీ పెద్దలు కలవనున్నారు. అయితే... కేసీఆర్‌ను కలుసుకోవడానికి వెళ్లిన సినీ పెద్దలు తనని పిలవలేదని బాలకృష్ణ మీడియా సాక్షిగా బయటపెట్టడం.. వివాదస్పదం అవ్వడం తెలిసిందే.
 
ఈ నేపధ్యంలో జగన్‌ని కలవడానికి వెళుతున్న సినీ పెద్దలు బాలయ్యను పిలుస్తారా..? పిలిస్తే.. బాలయ్య వెళతారా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఈ రోజు దగ్గుబాటి రామానాయుడు జయంతి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఫిల్మ్ నగర్ లోని రామానాయుడు విగ్రహానికి పూలమాల వేసి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌ని ఈ నెల 9న మధ్యాహ్నం 3 గంటలకు కలవనున్నామని... ఈ భేటికి నందమూరి బాలకృష్ణను కూడా పిలిచామని చెప్పారు. అయితే... జూన్ 10న బాలయ్య 60వ జన్మదినం. ఈ సందర్భంగా 9వ తారీఖున బిజీగా ఉండటం వలన సీఎం జగన్‌ని కలవడానికి రాలేకపోతున్నాను అని బాలయ్య చెప్పారని సి.కళ్యాణ్ తెలియచేసారు.
 
నిజంగానే బిజీగా ఉండటం వలన వెళ్లడం లేదా? లేక కేసీఆర్‌ని కలవడానికి వెళ్లినప్పుడు పిలవలేదనే కోపంతో రానని చెప్పారో తెలియదు కానీ... జగన్ కలవడానికి మాత్రం రాలేనని బాలయ్య చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు