తమిళంలో కమల్ హాసన్ బిగ్ బాస్ హోస్ట్‌గా గ్రాండ్ లెవల్లో ఆరంభం అంటూ బస్ స్టాపుల్లో పోస్టర్లు అంటించి నానా హంగామా చేసి ప్రారంభించినా షో పరిచయ కార్యక్రమం 'తుస్'మంది. దీంతో ఇప్పుడు తెలుగులో పరిస్థితి ఎలా వుంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు తెలుగు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనేవారు దొరకడంలేదట.
బిగ్ బాస్ షో సూపర్ సక్సెస్ కావాలంటే వివిధ రంగాల నుంచి ప్రముఖులు ఇందులో పాల్గొనాలి. కానీ పోసాని కృష్ణమురళి, నటి హేమ వంటి అతి తక్కువమంది ఈ షోలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సంప్రదించినవారిలో చాలామంది ఈ షోలో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం.
మరోవైపు ఈ షోను జూలై నెలలో చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. జూ.ఎన్టీఆర్ కు వున్న ఫాలోయింగ్ దృష్ట్యా షోలో పాల్గొనేవారు కూడా మంచి పేరున్నవారినే ఎంపిక చేయాలని షో నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే తమిళంలో స్టార్టయిన కమల్ బిగ్ బాస్ తుస్సుమందనే కామెంట్లు వినబడుతున్నాయి. ఈ నేపధ్యంలో జూ.ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ఎలా వుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొని వుంది.