అమెరికన్ నటి కిమ్ కర్దాషియన్ గురించి తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. తన న్యూడ్ ఫోటోలతో ప్రజలను మంత్రముగ్ధుల్నిచేస్తుందీ భామ. కైపెక్కించే కళ్లు, శరీర వంపు సొంపులతో కుర్రకారును రెచ్చగొట్టే ఈ అమెరికన్ టీవి స్టార్ బాటమ్స్ పెంచుకునే ఆపరేషన్ చేయించుకుందట. అందులో ఏముంది వింత అనుకుంటే పొరపాటే.. కిమ్ ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాతే సోషల్ మీడియాలో స్టార్‌గా ఎదిగిపోయింది. ఆమె అందాల్ని చూసి, తాము కూడా అలా అయిపోవాలని భావిస్తున్నారట నాలీవుడ్ హీరోయిన్లు. ఆఫ్రికా సంప్రదాయాల ప్రకారం వెనుక భాగం ఎత్తుగా మహిళలు అందెగత్తెలని అనుకుంటారట అక్కడి వాసులు. ఇంకో రకంగా ఈ ఆపరేషన్లు ఫేమస్ అవ్వడానికి ఇదో ముఖ్య కారణం.
నిజానికి ప్రేమికుడు సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. అందులో కమెడియన్ వడివేలు తన బాటమ్స్‌ను ఎత్తుగా చూపించుకునేందుకు గోచి పెట్టుకుని, పైన ప్యాంటు వేసుకుంటాడు. ఇపుడు నైజిరియా మహిళలు, నాలీవుడ్ (నైజీరియా ఫిలిం ఇండస్ట్రీ) హీరోయిన్లు వడివేలు ఐడియానే ఫాలో అయిపోతున్నారట. డబ్బున్న ధనికులైతే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని కైపెక్కించే బాటమ్‌ని సొంతం చేసుకుంచారు.
ఇక ఇవన్ని చేయించుకోడానికి వీలుపడని మధ్యతరగతి, పేద మహిళల కోసం రెడీమేడ్ దుస్తులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. వెనుక భాగం ఉబ్బెత్తుగా ఉండేలా తయారుచేసిన లో దుస్తులు ధరిస్తే ఎవరైనాసరే అందంగా కనిపిస్తారు. పిరుదుల అందాలచూసి ఎవరన్నా అదరహో అనాల్సిందే. ఆఫ్రికాలోని డబ్బున్నవాళ్లు జరుపుకొంటున్న పార్టీల్లో ఆడవాళ్ల చర్చంతా ఈ ఆపరేషన్లపైనే అంటున్నారు సర్జన్ డాక్టర్ ఎబునే.