అసలు అర్జున్ రెడ్డిని అల్లు అర్జున్ను దృష్టిలో ఉంచుకుని కథ రాసుకున్నానని, అందుకే సినిమాలోని ప్రధాన పాత్రకు అర్జున్ అని పేరు పెట్టానని చాలాసార్లు వెల్లడించాడు. అయితే, మెగా హీరో స్క్రిప్ట్‌ను తిరస్కరించాడు. శర్వానంద్ కూడా ఈ కథకు నో చెప్పారు. చివరకు అది విజయ్ దేవరకొండను వరించింది.
ఇప్పుడు "యానిమల్" ట్రైలర్ బయటకు రావడంతో, అసలు ఈ సినిమా నుండి ఏ హీరో తప్పుకున్నాడో కూడా సందీప్ చెప్పేశాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారు కూడా “యానిమల్” స్క్రిప్ట్‌ని విని పాస్ ఇట్ ప్లీజ్ అని చెప్పారని ఒక పుకారు ఉంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే, ఆ హీరోలలో ఎవరైనా ఈ పాత్రకు బాగా సరిపోతారు, కానీ ఖచ్చితంగా రణబీర్ కపూర్ సరిపోయాడు.