"ఖైదీ" సెట్లో గొడవపడి తప్పు చేశా.. సర్దుకపోయుంటే మరోలావుండేది : క్యాథరిన్

మంగళవారం, 10 జనవరి 2017 (11:08 IST)
కొంతమంది హీరోయిన్ల ప్రవర్తన వారి కెరీర్‌‌ను చేజేతులా నాశనం చేస్తుంది. ఆ తర్వాత తాము చేసిన తప్పు తెలుసుకున్నప్పటికీ.. సరిదిద్దుకునే అవకాశం లేక మథనపడిపోతుంటారు. ఇలాంటి వారిలో హీరోయిన్ కేథరిన్ థ్రెస్సా ఒకరు. ఈమె మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150'వ చిత్రంలోని ఓ ఐటమ్ సాంగ్‌లో నటించే అవకాశం వచ్చింది.
 
అయితే, ఈ పాట షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్‌తో కేథరిన్ గొడవపడింది. ఫలితంగా ఆమెను ఆ సినిమా నుంచి తప్పించి... ఆమె స్థానంలో లక్ష్మీరాయ్‌ను తీసుకున్నారు. ఈ పాటను ఇటీవల విడుదల చేయగా, సూపర్ హిట్‌గా నిలిచింది. పైగా ఈ పాటకు చిత్ర యూనిట్ మరింత పబ్లిసిటీ కల్పిస్తోంది. అందులో లక్ష్మీరాయ్‌ డ్యాన్స్‌ను బాగా ప్రమోట్‌ చేస్తున్నారట.
 
దీంతో లక్ష్మీరాయ్‌కి ఎక్కడలేని పబ్లిసిటీ వచ్చేస్తోంది. లక్ష్మీరాయ్‌కి వస్తున్న పబ్లిసిటీ చూసి క్యాథరిన్‌ కూడా బాధపడుతోందట. కొద్దిగా సర్దుకుని పోయుంటే ఆ పబ్లిసిటీ అంతా తనకే దక్కి ఉండేది కదా అని మధనపడిపోతోందట. అంతే మరి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే మరి అంటున్నారు సినీ జనాలు. 

వెబ్దునియా పై చదవండి