నంది అవార్డులపై చిరు స్పందించిన తీరు చూస్తే షాకే..

సోమవారం, 20 నవంబరు 2017 (15:32 IST)
నంది అవార్డుల పేర్ల ప్రకటన కాస్త సినీరంగంలో అగ్రహీరోల మధ్య గ్యాప్ తెచ్చి పెట్టింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ఈ అవార్డును రాజకీయ రంగు పులిమి పేర్లు ప్రకటించిదంటూ కొంతమంది అంతెత్తు లేచిపడ్డారు. మరికొంతమందైతే డిబేట్లో పాల్గొని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. బాలక్రిష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉండటం వల్లనే ఆయన సినిమాకు తొమ్మిది నంది అవార్డులు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ.
 
అయితే దీనిపై బాలక్రిష్ణ ఇప్పటికే స్పందించారు కానీ.. అసలు హీరో చిరంజీవి మాత్రం దీనిపై మాట్లాడలేదు. మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని ఆయన కుటుంబంలోని బన్నీ వాసు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వచ్చారు. దీనిని మొదట్లో పట్టించుకోని చిరంజీవి ఆ వ్యవహారం కాస్త పెద్దదిగా మారుతుండటంతో ఇక చేసేది లేక బన్నీ వాసును ఇంటికి పిలిచి క్లాస్ ఇచ్చారట. 
 
మనం అవార్డుల కోసం పని చేయడం లేదు. ప్రేక్షకుల ఆనందమే మనకు ముఖ్యం. అనవసరంగా మీడియా ముందుకెళ్ళి మన పరువును మనమే రోడ్డుపైన లాక్కోకూడదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలెయ్యండి. ఎవరికి నంది అవార్డులు ప్రకటిస్తే వారు తీసుకుంటారు. నేను ఏ రోజు అవార్డు వస్తుందని పనిచేయలేదు. ఈ విషయం నీకే కాదు.. యావత్ సినీ ప్రపంచానికే తెలుసునని బన్నీ వాసును మందలించి చిరు పంపించేశారట. 
 
చిరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమేనంటున్నారు సినీవర్గాలు. ఏరోజు చిరంజీవి అవార్డుల కోసం వెంపర్లాడలేదు. ఈ అవార్డుల విషయంపై కూడా చిరు స్పందించకూడదని ముందు అనుకున్నట్లు ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారు. అయితే ప్రతిచోటా మెగా ఫ్యామిలీ వ్యవహారమే తెరపైకి వస్తుండటంతో ఇక చిరు దీనిపై స్పందించారట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు