సక్సెస్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి గురించి చాలా మందికి తెలిసిందే. తను ఏ పనిచేసినా శిల్పి చెక్కినట్లు చెక్కుతాడు. అందుకే జక్కన్న అంటుంటారు. వాణిజ్య ప్రకటనలు, సీరియల్, సినిమా ఏది తీసినా దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించాక ఒకటి రెండు సార్లు షూట్ చేసి వద్దనుకుంది తీసేస్తాడు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజమౌళి తెలుగు సినిమా చరిత్రను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడుగా పేర్కొంటూ ఈగ, బాహుబలి సినిమాలు లాస్ ఏంజెల్స్‌లో ప్రేక్షకుల స్పందన, అంతర్జాతీయ ఫెస్టివల్‌లో ఆ సినిమాలు ప్రదర్శించడం గురించి చిన్న క్లిప్‌ను ఆయన బృందం నేడు విడుదలచేసింది.